GRAMA SABHA: 24 గంటల్లో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:08 AM
గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను 24 గంటల్లో పరిష్కారం అయ్యేల చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల అమోదం కోసం ప్రభుత్వం ఒక్కరోజు గ్రామ సభ నిర్వహించింది.
గార్లదిన్నె, ఆగస్టు 23: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను 24 గంటల్లో పరిష్కారం అయ్యేల చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల అమోదం కోసం ప్రభుత్వం ఒక్కరోజు గ్రామ సభ నిర్వహించింది. శుక్రవారం మండలంలోని 18 పంచాయతీల్లో అధికారులు గ్రామ సభ్యులు నిర్వహించారు. గార్లదిన్నెలో నిర్వహించిన సభకు జేసీ, ట్రైనీ కలెక్టర్ వినూత్న, డీపీఓ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. గ్రామంలో వీధిలైట్లు కాలిపోతే పట్టించుకోలేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. హెచఎల్సీలో పూడిక తీయకపోవడంతో పంటలకు సాగునీరు రావాలంటే ఇబ్బందిగా ఉందని, కాలువల్లో పూడితతీత పనులు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో వీధిలైట్లు కాలిపోతే 24 గంటల్లో లైట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివా్‌సనాయక్, తహసీల్దార్ బండారు ఈరమ్మ, ఎంపీడీఓ విజయ్‌బాస్కర్, ఈఓఆర్డీ వెంకటలక్ష్మి, ఎంఈఓ తారా చంద్రానాయక్ పాల్గొన్నారు.
ప్రజలకు జవాబుదారీగా కూటమి ప్రభుత్వం
- బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి జవాబుదారిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గొంది అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం రుద్రంపేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలనకు నిదర్శనంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల స్వంత్రతను కాలరాసిన జగన్మోహనరెడ్డి కేంద్ర నిధులను సైతం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి: గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభలు ఏర్పాటుచేసిందని టీడీపీ కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు దండుఓబుళేశు పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం పనుల గుర్తింపుపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ గంగావతి, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్,ఏఓ 23నార్పల1: ఎంపీడీఓకు వినతి పత్రం అందజేస్తున్న జనసేన నాయకులు
నార్పల: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ అశ్వత్థనాయుడు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు బోందలవాడ, గూగూడు, తదితర గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించారు. నార్పలలో తాగునీటి సమస్య పరిష్కరించాని, డ్రైనేజీ నిర్మించాలని, వీధిలైట్లు, తదితర సమస్యలు పరిష్కరించాలని పలువురు ఆర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ గంజిగుంట రామకృష్ణ, అధికారులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.
శింగనమల: పంచాయతీలు స్వయంసమృద్ధి సాధించాలన్న ధ్యేయంతో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ఎక్కడా చూసినా డ్రైనేజీ, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, అంగనవాడీలకు ప్రహరీ సమస్యలపై అధికారులకు గ్రామస్థులు విన్నవించారు. 19 పంచాయతీల్లో మండలస్థాయి అధికారులతో ఉపాధి పనుల గుర్తింపుపై ప్రజలు, ప్రజాపతినిధులు తీర్మానం చేశారు. గ్రామసభలో ఎక్కవగా గ్రామాల్లో ఆపరిశుభ్రతతోపాటు, ఉపాధి పనుల ద్వారా వ్యవసాయపనులు, సీసీ, మట్టిరోడ్లు, అంగనవాడీ భవనాలు వాటికి ప్రహరీ నిర్మాణాలు, ఇరిగేషన పనులు గుర్తించారు. డ్వామా పీడీ సుధాకర్‌రెడ్డి ఈఓఆర్‌డీ మురళీకృష్ణ, ఏపీఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ సర్పంచులు డేగలలితమ్మ, రమేష్, నగమునేమ్మ, నల్లప్పరెడ్డి, వెంకటరాముడు పాల్గొన్నారు.
రాప్తాడు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రాప్తాడులో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో పీడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పశువుల, గొర్రెల షెడ్లు, పండ్ల తోటల పెంపకం, చెరువులు తదితర అభివృద్ధి పనులు చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లోని ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ సాకే తిరుపాలు, ఎంపీడీఓ సాల్మనరాజ్, తహసీల్దార్ విజకుమారి, ఏపీడీ అనురాధ, కన్వీనర్ కొండప్ప, మాజీ కన్వీనర్ నారాయణస్వామి పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: మండలంలోని గ్రామాల్లో గ్రామ సభలు జోరుగా సాగాయి. పత్రి గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. గ్రామస్థులు, టీడీపీ నాయకులు గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు తదితర సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు.
ఆత్మకూరు: మండలంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలకు విషేశ స్పందన వచ్చింది. గ్రామ పంచాయతీల్లో ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి అధికారులకు తమ సమస్యలు విన్నవించారు. పలు అభివృద్ధి పనులపై అధికారులు తీన్మానాలు చేశారు. తహసీల్దార్ లక్ష్మినాయక్, ఎంపటీసీ పారిజాతమ్మ, టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు, శశాంక చౌదరి పాల్గొన్నారు.