TDP PRESIDENT: టెర్రరిస్టుల పాలన సాగించిన జగన
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:13 AM
టెర్రరిస్టుల పాలనను తలపించేలా గత ఐదేళ్లలో జగన పాలన సాగించాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్నలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 9: టెర్రరిస్టుల పాలనను తలపించేలా గత ఐదేళ్లలో జగన పాలన సాగించాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్నలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడును అక్రమ అరెస్టు చేశారన్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలతోపాటు దేశమంతా చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఎలాంటి మచ్చలేని చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వైసీపీ అరాచకాలను గమనించిన ప్రజలు జగనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికీ జగన కళ్లుతెరవకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు రాత్రింబవళ్లు చంద్రబాబు, మంత్రులు, అధికార యంత్రాంగం కష్టపడుతోందన్నారు. బాధితులకు చేయూతనివ్వాల్సిందిపోయి వరదను రాజకీయం చేస్తూ జగన మాట్లాడటం సిగ్గుచేటన్నారు.