MLA AMILINENI: జగన అవినీతి అమెరికాకు పాకింది
ABN , Publish Date - Nov 27 , 2024 | 12:06 AM
అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన చేసిన అవినీతి, అక్రమాలు అమెరికాకు పాకిందంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు.
కళ్యాణదుర్గం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన చేసిన అవినీతి, అక్రమాలు అమెరికాకు పాకిందంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వుండగా అదానీ నుంచి లంచం తీసుకున్నారంటే ఎంత దారుణమన్నారు. జగనరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ అంటూ మాయమాటలు చెప్పి ఉద్యోగమేళా అంటూ యువతను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇక్కడున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పిండమే మా ప్రధాన లక్ష్యమన్నారు. ఇరిగేషన, ఆర్థిక మంత్రులతో సమన్వయం చేసుకుని బీటీపీ ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు ముందుకెళతామన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 17 మందికి రూ.7.10 లక్షలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కర్నూలులో హైకోర్టు బెంచ ఏర్పాటుకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పట్టణంలోని ప్రజావేదిక వద్ద న్యాయవాదులతో కలసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు.