Share News

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:52 PM

ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు.

FLOWERS PRICE RISE: కనకాంబరం కిలో రూ.2వేలు

హిందూపురం, అక్టోబరు 10: ద సరా పండగంటే పదిరోజుల వేడుక. దీంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. అమాంతం ధరలు పెరిగిపోయాయి. శరన్నవరాత్రి నేపథ్యంలో ప్రస్తుతం పూలధరలు ఒకేసారి పెంచేశారు. గురువారం మార్కెట్‌లో పూల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కనకాంబరం పూల దిగుబడి తగ్గి, మార్కెట్‌కు తక్కువగా వచ్చాయి. దీంతో ధర కిలో రూ.1800 నుంచి రూ.2వేలకు పెరిగింది. మల్లెపూలు రూ.1000 నుంచి రూ.1200దాకా పలుకుతున్నాయి. బంతిపూలు కిలో రూ.80 నుంచి రూ.120 ఉండగా.. చామంతి రూ.200 నుంచి రూ.300దాకా పలుకుతున్నాయి. ఈ ప్రాంతంలో చెండుపూలు సాగుచేసిన రైతులు అధికశాతం తెలంగాణ ప్రాంతానికి తరలించారు. బతుకమ్మ, నవరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ ప్రాంతంలో పూలకు గిరాకీ ఉంటుందని రైతులు అక్కడికి ఎగుమతి చేశారు. గురువారం హిందూపురం మార్కెట్‌లో పూలధరలు అమాంతం పెంచేశారు. వారం క్రితం వరకు చెండుపూలు కిలో రూ.30 ఉండగా.. ప్రస్తుతం వందకు పెరిగింది. వారం క్రితం చామంతి కిలో రూ.100 ఉండగా.. గురువారం 200 నుంచి రూ.300 తో అమ్ముడుపోయింది. గులాబీలు రూ.250 నుంచి రూ.300దాకా విక్రయించారు.

Updated Date - Oct 10 , 2024 | 11:52 PM