MLA SUNITA : తోపుదుర్తి సోదరుల కనుసన్నల్లోనే భూ ఆక్రమణలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:39 PM
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మం డలంలో తోపుదుర్తి సోదరుల అండతో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజారెవెన్యూ దర్బార్- భూ సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, రెవెన్యూ అధికా రులతో కలిసి ఎమ్మెల్యే రైతుల నుంచి అర్జీల ను స్వీకరించారు.
నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం
ప్రజారెవెన్యూ దర్బార్‌లో ఎమ్మెల్యే పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మం డలంలో తోపుదుర్తి సోదరుల అండతో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజారెవెన్యూ దర్బార్- భూ సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, రెవెన్యూ అధికా రులతో కలిసి ఎమ్మెల్యే రైతుల నుంచి అర్జీల ను స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలను విన్నవించారు. ఎక్కు వగా ఒకరిభూమి మరొకరిపేరిట ఆనలైనలో మార్చే శారని, గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో జరిగిన తప్పుల గురించి ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 157 ఫిర్యాదు లు ఎమ్మెల్యే ఆర్డీఓతో కలిసి స్వీకరించారు.
ప్రతి రైతు సమస్యను ఓపిగ్గా విని వాటిలో తక్షణమే పరిష్కరిం చాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ..ఈ మండలంలో గత ప్రభుత్వంలో పలువురి భూమిరికార్డులు మార్చేశారని, రైతులు అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. స్థానికంగా ఓ డాబానే రెవెన్యూ కార్యాలయంగా మార్చి అక్కడ పంచాయతీలు చేసి అమాయకరైతుల భూములను కాజేశారన్నారు. ముఖ్యంగా వీఆర్వో మ హేశ్వరరెడ్డి విచ్చలవిడిగా భూ దందాలకు పాల్ప డ్డారని ఎంతో మంది భూములను కాజేశారని అలాంటి వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిం చారు. పైగా ఆ వ్యక్తికి పుట్టపర్తి మండలంలో పోస్టింగ్ ఇవ్వడం ఆశ్చర్యమేస్తోందన్నారు. తోపుదుర్తి సోదరుల భూమాఫియాను మొత్తం బయటకు తీస్తామని బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేశకుమార్, ఎంపీడీఓ శివశంకరప్ప, సీఐ శ్రీధర్, టీడీపీ మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....