Share News

SCHOOL OPEN : బడికి పోదాం పద..!

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:45 PM

వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన 12 నుంచి తరగతులు పునఃప్రారంభమౌతాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక్కరోజు అదనపు సెలవు వచ్చింది. 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత, మున్సిపల్‌, అన ఎయిడెడ్‌, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌.. ఇలా అన్ని యాజమాన్యాల్లో 2,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,81,091 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ...

SCHOOL OPEN : బడికి పోదాం పద..!
Potti Sri Ramulu School in the city is ready to reopen

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

వారంపాటు పర్యావరణ దినోత్సవాలు

అనంతపురం విద్య, జూన 12: వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన 12 నుంచి తరగతులు పునఃప్రారంభమౌతాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఒక్కరోజు అదనపు సెలవు వచ్చింది. 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత, మున్సిపల్‌, అన ఎయిడెడ్‌, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, బీసీ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌.. ఇలా అన్ని యాజమాన్యాల్లో 2,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,81,091 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో బాలురు 2,02,380 మంది, బాలికలు 1,78,711 మంది ఉన్నారు. జిల్లాలోని 1,747 ప్రభుత్వ రంగ పాఠశాలల్లో 2,16,281 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్‌ రంగంలో 676 పాఠశాలలు, 1,64,810 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా బడి బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.


పర్యావరణ దినోత్సవాలు

పాఠశాలలు పునః ప్రారంభమయ్యాక వారంరోజులు పర్యావరణ దినోత్సవాలను నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 20 వరకూ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. స్టూడెంట్‌ కిట్లను ఎంఈఓలు పరిశీలించాలని, సక్రమంగా లేనివాటిని వెంటనే వెనక్కు పంపాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో వీటిని పంపిణీ చేస్తారని సమాచారం. ఉపాధ్యాయులు గతంలో మాదిరి ఫేషియల్‌ యాప్‌లో హాజరు వేయాలని ఆదేశాలు వచ్చాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 12 , 2024 | 11:45 PM