MLA DAGGUPATI: బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా రుణాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:05 AM
ఏపీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు రూ.40 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటే శ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రూ.40 లక్షల మెగా చెక్‌ను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 23: ఏపీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు రూ.40 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటే శ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రూ.40 లక్షల మెగా చెక్‌ను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన ద్వారా అందిస్తున్న రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, ఆర్థికపురోభివృద్ధి సాధించాలన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో అన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి, ఆర్థికంగా చేయూతనిచ్చారన్నారు. గత వైసీపీ పాలనలో రాజకీయ నిరుద్యోగులతో కార్పొరేషన్లలో అలంకరించారని విమర్శించారు. కనీసం వారు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని, కార్పొరేషన్ల ద్వారా అన్ని కులాలకు న్యాయం చేస్తామన్నారు. నాయకులు రాయల్ మురళి, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ బిందు, క్యాషియర్ నవ్యశ్రీ, ప్రసాద్‌రావు, రాఘవేంద్రరావు, విశ్వేశ్వరరావు, సంధ్యా, నరసింహారావు పాల్గొన్నారు.