Share News

KULLAISWAMY : అనుగ్రహించు స్వామీ..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:07 PM

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. జలధి కార్యక్రమం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున వెండిగొడుగులు సహా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు నినదించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించారు. స్వామివారు సాయంత్రం రెండోసారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు విషాద వదనంతో, కన్నీరు కారుస్తూ గ్రామ సమీపంలోని బావిలో జలధి కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి ...

KULLAISWAMY : అనుగ్రహించు స్వామీ..!
Piers entering the fire pit

కుళ్లాయిస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

వేడుకగా స్వామివారి అగ్నిగుండ ప్రవేశం.. జలధి

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. జలధి కార్యక్రమం బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం అనంతరం తెల్లవారుజామున వెండిగొడుగులు సహా అగ్నిగుండ ప్రవేశం చేశారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు నినదించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించారు. స్వామివారు సాయంత్రం రెండోసారి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం భక్తులు విషాద వదనంతో, కన్నీరు కారుస్తూ గ్రామ సమీపంలోని బావిలో జలధి కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి


బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు గూగూడులోని కొండలవైపు, పొలాల వైపు గుడారాలు వేసుకున్నారు. విందు భోజనాలు ఆరగించారు. జలధి ముగియగానే వచ్చిన వాహనాలలో తిరుగుపయనమయ్యారు. దీంతో రహదారులు కిటకిటలాడాయి. సుమారు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ నెల 19న కుళ్లాయిస్వామి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ శోభ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 17 , 2024 | 11:07 PM