Share News

CPM : నేడు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:47 PM

రానున్న బడ్జెట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాకు తాగు, సాగునీటి సాధన కోసం ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టామని, యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపపట్టను న్నట్లు తెలిపారు.

CPM : నేడు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా
Rambhupal speaking in the meeting

బడ్జెట్‌లో జిల్లా సాగునీటికి ప్రాధాన్యమివ్వాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : రానున్న బడ్జెట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాకు తాగు, సాగునీటి సాధన కోసం ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టామని, యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపపట్టను న్నట్లు తెలిపారు. స్థానిక గణేనాయక్‌ భవనలో ఆదివా రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. బస్సుయాత్ర ద్వారా సీపీఎం బృందం సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించడంతోపాటు ప్రజలనుంచి అనేక సమస్యలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో తాము 24 మండలాల్లో 803 కిలోమీటర్లు పర్యటించినట్లు తెలిపారు. బీటీపీ, మిడ్‌ పెన్నార్‌, జీడిపల్లి, సుబ్బరాయసాగర్‌ ప్రాజెక్ట్‌లు కనీస ని ర్వహణకు నోచుకో లేదని తెలుస్తోం ద న్నారు.


జిల్లాకు ప్ర ధాన సాగునీటి వనరులుగా ఉన్న హంద్రీనీవా, తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిస్థితి అదేరకంగా ఉందన్నారు. నిర్వహణాలోపాలతో ఈ ఏడాది శ్రీశైలం, తుంగభద్ర డ్యాముల్లో నీరు పుష్కలంగా ఉన్నా జిల్లాకు తీసుకురాలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం జలవనరులశాఖ అధికారుల సమీక్ష నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. నవంబరులో పెట్టబోయే బడ్జెట్‌లో జిల్లా సాగు నీటికి నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన సమస్య ల్లో గిట్టుబాటు ధరల అంశం కూడా ఉందన్నారు. ప్రభు త్వం తక్షణమే గిట్టుబాటు ధర కల్పించే చర్యలు చేప ట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించే ధర్నాలో రైతులు, ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప, సావిత్రి, నాగేంద్రకుమార్‌, కృష్ణమూర్తి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 11:47 PM