Share News

GAMES : గ్రూప్‌ - బి పోటీల్లో పలు జట్ల విజయం

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:54 PM

ఎస్‌కే యూనివ ర్సిటీ అంతర్‌ కళాశాలల బి - గ్రూప్‌ టోర్నీలో పలు జట్లు విజయం సాధిం చాయి. నగరంలోని ఎస్‌ఎస్‌బీతఎన కళాశాలలో ఎస్‌కేయూ అంతర్‌ కళాశాలల గ్రూప్‌- బి పోటీలు ఆదివారం నిర్వహించారు.

GAMES :  గ్రూప్‌ - బి పోటీల్లో పలు జట్ల విజయం
SSBNA and Arts College teams reached Kabaddi final

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్‌కే యూనివ ర్సిటీ అంతర్‌ కళాశాలల బి - గ్రూప్‌ టోర్నీలో పలు జట్లు విజయం సాధిం చాయి. నగరంలోని ఎస్‌ఎస్‌బీతఎన కళాశాలలో ఎస్‌కేయూ అంతర్‌ కళాశాలల గ్రూప్‌- బి పోటీలు ఆదివారం నిర్వహించారు. బాస్కెట్‌బాల్‌ పోటీలలో ఎస్‌కేయూపై ఎస్‌ఎస్‌బీఎన జట్టు గెలుపొందింది. షటిల్‌ బ్యాడ్మింటనలో ఎస్‌ఎస్‌బీఎనపై ఆర్ట్స్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. కబడ్డీలో ఎస్‌ఎస్‌బీఎన, ఆర్ట్స్‌ కళాశాల జట్లు సోమవారం చివరి మ్యాచలో తలపడనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌బీఎన కళాశాల పీడీ ప్రసాద్‌, పీడీలు, సీనియర్‌ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 20 , 2024 | 11:54 PM