Share News

MLA DAGGUPATI: లక్ష మందితో సభ్యత్వ నమోదు చేయించాలి

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:39 PM

అనంతపురం అర్బన పరిధిలో లక్ష మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక 43వ డివిజన ఐదో రోడ్డులో సాయి బాబా ఆలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

MLA DAGGUPATI: లక్ష మందితో సభ్యత్వ నమోదు చేయించాలి
MLA Daggupati Prasad who is taking membership

అనంతపురం అర్బన, అక్టోబరు 9: అనంతపురం అర్బన పరిధిలో లక్ష మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక 43వ డివిజన ఐదో రోడ్డులో సాయి బాబా ఆలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఎమ్మెల్యే త న సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ చేయని విధంగా సభ్యత్వ నమోదు తీసుకుంటే బీమా సౌకర్యాన్ని కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎంపీ మాట్లాడుతూ అనంత జిల్లా టీడీపీకి కంచుకోట అన్నారు. ఎన్టీఆర్‌ బాటలోనే చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా చూస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. నాయకులు బుగ్గయ్య చౌదరి, తలారి ఆదినారాయణ, గాజుల ఆదెన్న, రాయల్‌ మురళీ, మాజీ కార్పొరేటర్‌ సరళ, కొండవీటి సుధాకర్‌ నాయుడు, కూచి హరి, పోతుల లక్ష్మీనరసింహులు, నూర్‌మహ్మద్‌, సైఫుద్దీన, సరిపూటి రమణ, బల్లా పల్లవి, రాజారావు పాల్గొన్నారు.


నడిమి వంక పరిసర కాలనీలు నీట ముగనివ్వం: నగరంలోని నడిమి వంక, మరువ వంక పరిసర కాలనీలను మరోసారి నీట మునగనివ్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక 48వ డివిజన లోని సోమనాథ్‌ నగర్‌, ఆర్కేనగర్‌, రజక్‌ నగర్‌ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక ప్రజలు డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ నడిమి వంక, మరువ వంక కాలువలకు ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ ఏర్పాటుతోపాటు డ్రైనేజీల ఎత్తు పెంచేందుకు రూ.124 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు పేర్నొన్నారు. స్వప్న, గుర్రం నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 11:40 PM