MLA DAGGUPATI : గుంతల రోడ్లకు త్వరలో మోక్షం
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:09 AM
అర్బన నియోజకవర్గంలో గుంతలు పడిన రోడ్లకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని 12వ డివిజనలో నగర పాలక సంస్థ కమి షనర్ నాగరాజు, కార్పొ రేటర్ బాబాఫకృద్దీనతో కలిసి మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
తిలక్‌నగర్‌లో మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే
అనంతపురం అర్బన, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అర్బన నియోజకవర్గంలో గుంతలు పడిన రోడ్లకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని 12వ డివిజనలో నగర పాలక సంస్థ కమి షనర్ నాగరాజు, కార్పొ రేటర్ బాబాఫకృద్దీనతో కలిసి మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. తిలక్ రోడ్డు లో రోడ్లు ఇరుకుగా ఉన్నా యని, పైగా గుంతలు పడ టంతో రాకపోకలకు ఇబ్బం దిగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొ చ్చారు. డ్రైనేజీ కాలువలు కూడా సరిగా శుభ్రం చేయ డం లేదని వా పోయారు. నగరంలో రోడ్ల మరమ్మత్తుల కోసం ఇప్పటికే రూ.35 లక్షలు ఎనసీఏపీ నిధుల కోసం ప్రతిపాదనలు పం పామని, నిధులు రాగానే గుంతలు పడిన రోడ్లకు మరమ్మ తులు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధ్వానంగా మారిన పరిస్థితులను ఒక్కొక్కటి మారుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల లక్ష్మీనరసింహు లు, సరిపూటి రమణ, కృష్ణకుమార్, బాలసుబ్రహ్మణ్యం, మున్వర్, లక్ష్మీనరసింహ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మౌలానా విగ్రహం ఏర్పాటుకు చర్యలు
అనంతపురం అర్బన, నవంబరు 8(ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చొరవతో స్వాతంత్య్ర సమరయోధుడు అబుల్ కలాం ఆజాద్ విగ్ర హాన్ని క్లాక్ టవర్ సమీపంలో తిరిగి ఏర్పాటు చే స్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. పలువురు మైనార్టీ నాయకుల విన్నపానికి స్పందించిన ఎమ్మెల్యే తిరిగి క్లాక్‌టవర్ సమీపంలో అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారు. విగ్రహం ఏర్పాటును ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....