Share News

MP, MLA: ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:56 PM

పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్‌లో ప్రభుత్వ పాఠశాలను ఎంపీ, ఎమ్మెల్యేలు గురువారం తనిఖీ చేశారు.

MP, MLA: ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం
MP and MLA inspecting the rice served to students

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 6: పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్‌లో ప్రభుత్వ పాఠశాలను ఎంపీ, ఎమ్మెల్యేలు గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. తరువాత విద్యార్థుల హాజరు ఎంతుందని చూశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం ముద్దగా ఉండటాన్ని గమనించి ఏజెన్సీ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భోజనాన్ని విద్యార్థులు ఎలా తింటారని ప్రశ్నించారు. వెంటనే ఏజెన్సీ వారితో మాట్లాడి పాఠశాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు గంగారామ్‌, బీజేపీ లలితకుమార్‌, నాయకులు శ్రీనివాసులురెడ్డి, భక్తవత్సల నాయుడు, బాషా, ఖాసీం, బాలప్ప, నాగభూషణం పాల్గొన్నారు.

ప్రజలకు సక్రమంగా రేషన అందించాలి: ప్రజలకు క్రమం తప్పకుండా రేషన అందించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగర్‌, అజయ్‌ఘో్‌షకాలనీలో ఏర్పాటు చేసిన నూతన రేషన షాపులను వారు ప్రారంభించారు.


ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోండి

అనంతపురం అర్బన: నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ తరుణ్‌కుమార్‌, మేనేజర్‌ మురళీకృష్ణ, నగర పాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ హరిప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ రఘుప్రసాద్‌, ఇతర అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ట్రాఫిక్‌ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఇతర అంశాలపై చర్చించారు.

వరద బాధితులకు అండగా స్వయం సహాయక మహిళలు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనంతపురం అర్బన పరిధిలోని మెప్మా స్వయం సహాయ సంఘాల సభ్యులు ముందుకొచ్చారు. మాజీ మేయర్‌ స్వరూప ఆధ్వర్యంలో సభ్యులు వరద బాధితులకు సేకరించిన రూ.3.5 లక్షల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కు అందజేశారు. సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

Updated Date - Sep 06 , 2024 | 11:56 PM