Share News

YCP : వైసీపీ నాయకుల మట్టి దందా

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:41 PM

మండలంలో వైసీపీ నాయకుల మట్టిదందాకు అడ్డు అదుపులేకుండా పోయింది. యాడికిలోని వేములపాడు రోడ్డులో ఆదివారం అక్రమంగా మట్టిని తరలించి విక్రయాలు జరిపారు. స్థానిక మరువ వంకలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్‌ తవ్వారు. ఆ మట్టిని సైతం ఎక్స్‌కవేటర్ల ద్వారా ట్రాక్టర్‌లో నింపి రూ.వెయ్యికి విక్రయించేశారు. ఆదివారం సెలవు రోజు కావడం, అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడంతో వైసీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు వంద ట్రాక్టర్ల మట్టిని

YCP : వైసీపీ నాయకుల మట్టి దందా
వంకలో మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న ఎక్స్‌కవేటర్‌

‘ఉపాధి’ గుంతల మట్టిని సైతం తోడేసి విక్రయం

యాడికి, జూలై 7: మండలంలో వైసీపీ నాయకుల మట్టిదందాకు అడ్డు అదుపులేకుండా పోయింది. యాడికిలోని వేములపాడు రోడ్డులో ఆదివారం అక్రమంగా మట్టిని తరలించి విక్రయాలు జరిపారు. స్థానిక మరువ వంకలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్‌ తవ్వారు. ఆ మట్టిని సైతం ఎక్స్‌కవేటర్ల ద్వారా ట్రాక్టర్‌లో నింపి రూ.వెయ్యికి విక్రయించేశారు. ఆదివారం సెలవు రోజు కావడం, అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడంతో వైసీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు వంద ట్రాక్టర్ల మట్టిని


తరలించేశారు. యాడికిలోని భైరవకొండ, మరువ వంకలో తరచూ మట్టి మాఫియా చెలరేగిపోతుండటంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా రైతులు తమ పొలాలను సారవంతం చేసుకోవడానికి మట్టిని తరలిస్తుంటే ఆ వాహనాలను అధికారులు సీజ్‌ చేస్తున్నారు కానీ మట్టి మాఫియాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారని వారు విమర్శిస్తున్నా రు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఫారంపాండ్‌ల వద్ద తవ్విన మట్టిని సైతం తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 07 , 2024 | 11:41 PM