Share News

GUMMANURU: నా విజయం ఏకపక్షం: గుమ్మనూరు

ABN , Publish Date - May 14 , 2024 | 12:54 AM

ఈ ఎన్నికలో తన విజయం, రాష్ట్రం లో పార్టీ విజయం ఏకపక్షమని ఉమ్మడి అ భ్యర్థి గుమ్మనూరు జ యరాం అన్నారు.

GUMMANURU: నా విజయం ఏకపక్షం: గుమ్మనూరు
మాట్లాడుతున్న గుమ్మనూరు జయరాం


గుంతకల్లు టౌన, మే 13: ఈ ఎన్నికలో తన విజయం, రాష్ట్రం లో పార్టీ విజయం ఏకపక్షమని ఉమ్మడి అ భ్యర్థి గుమ్మనూరు జ యరాం అన్నారు. సో మవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన అనంతరం జయరాం తన స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 45 రోజులుగా తనను నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సహకరించారని అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, కేసీ హరి, ప్రతాప్‌ నాయుడు, యూసుఫ్‌, డీ బిల్వా మస్తాన, పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2024 | 12:54 AM