నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలి: ఏఐఎస్‌ఏ
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:20 AM
వైద్య విద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స టెస్ట్ (నీట్-2024)ను తిరిగి నిర్వహించాలని ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతపురం సెంట్రల్, జూన 10: వైద్య విద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స టెస్ట్ (నీట్-2024)ను తిరిగి నిర్వహించాలని ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన లో ఆయన మాట్లాడారు. తమ పిల్లలను డాక్టర్‌ను చేయాలన్న తపనతో లక్షలాదిమంది తల్లిదండ్రులు కూలీపనులు చేసి చదివిస్తున్నారన్నారు.
ఎంట్రెన్స, కోచింగ్ అంటూ రూ.లక్షలు పోసి చదివిస్తే.. కేంద్ర ప్రభుత్వం అవకతవలకు పాల్పడుతూ విద్యార్ధులు.. వారి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. అక్రమంగా జేబులు నింపుకునేందుకు నీట్ పరీక్షా పేపర్లను లీక్‌చేసి ప్రతిభగల విద్యార్థులను రోడ్డున పడేసిందని వాపోయారు. తక్షణమే నీట్ పరీక్షలను తిరిగి నిర్వహించి.. బాధిత విద్యార్థులకు న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వ అవినీతిని రోడ్డు కీడుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, రాజునాయక్, సద్దాం, ఉదయ్ పాల్గొన్నారు.