Share News

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

ABN , Publish Date - May 12 , 2024 | 11:40 PM

పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటర్ల క్యూలైన్ల కోసం బారికేడ్ల ఏర్పాటు, నీడకోసం షామియానాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతుల కల్పనపై పర్యవేక్షించడంతో లోపాలు బయటపడ్డాయి.

TDP: వసతుల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం
యాడికిలో ర్యాంప్‌ ఏర్పాటు కోసం పనులు చేపడుతున్న దృశ్యం

అసిస్టెంట్‌ కలెక్టర్‌ మందలింపుతో చలనం

యాడికి, మే12: పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటర్ల క్యూలైన్ల కోసం బారికేడ్ల ఏర్పాటు, నీడకోసం షామియానాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతుల కల్పనపై పర్యవేక్షించడంతో లోపాలు బయటపడ్డాయి. సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. యాడికి హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద సాయంత్రం 5:30గంటల సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేయడం కనిపించింది. ర్యాంప్‌ల పనులు అప్పటికప్పుడు చేపడుతుండడం కనిపించింది.


పెద్దవడుగూరు: మండలకేంద్రంలోని జడ్పీపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న పరిశీలించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రతరంగా ఉండడం వల్ల తాగునీరు, పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.

Updated Date - May 12 , 2024 | 11:40 PM