WATER PROBLEM : రోగులకు నీరేదీ..?
ABN , Publish Date - May 03 , 2024 | 01:03 AM
గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలరోజుల నుంచి చుక్క నీరు అందుబాటులో లేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రోగులు నీటిని బయట కొనాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ ద్వారా మెడికల్, లేబర్ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యం ...
గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలరోజుల నుంచి చుక్క నీరు అందుబాటులో లేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రోగులు నీటిని బయట కొనాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ ద్వారా మెడికల్, లేబర్ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆ తరువాత ఆర్వో ప్లాంట్, తాగునీటి కొళాయిలను తొలగించారు. ఫార్మాసీ స్టోర్ సమీపంలో, బయట రెండు నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటి ట్యాంకులను నింపేవారు. నెల రోజుల నుంచి నీటి సరఫరా నిలిపేశారు. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించారు. కానీ తాగునీటి సౌకర్యం కల్పించలేదు.
- గుంతకల్లు టౌన