Share News

BOY'S NAME 126: 126 అంకెలు కాదు... బాలుడి పేరు

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:45 PM

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉం టుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు.

BOY'S NAME 126: 126 అంకెలు కాదు... బాలుడి పేరు
A boy named 126

తాడిపత్రి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉం టుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు. ఇంకా కొందరు వెరైటీ కోసం ఇంటర్‌నెట్‌లో చూసి వినూత్నంగా ఉండే లా పెడతారు. కానీ తాడిపత్రికి చెందిన ఓ టీచర్‌ తన కుమారుడికి అంకెలతో పేరు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాడిపత్రిలోని సుంకులమ్మపాలెంకు చెందిన రాఘవేంద్ర, ప్రశాంతి దంపతులు తమ కుమారుడికి 126 అంటూ అంకెలతో పేరు పెట్టారు. రాఘవేంద్ర పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆధార్‌కార్డు, డేట్‌ఆ్‌ఫబర్త్‌ సర్టిఫికెట్‌, పాఠశాల రికార్డుల్లో కూడా 126గా నమో దు చేయించాడు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే 126 అంకెల్లో 1 అంటే ఐ, 2 అంటే యామ్‌, 6కి ఇండియన అని అర్థం వచ్చేలా పెట్టానన్నా రు. కుల, మత బేధాలు ఉండకుండా అందరూ భారతీయులుగా జీవించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. తన కుమారుడికి ప్రస్తుతం ఆరేళ్ల వయసు ఉన్నా, పుట్టిన కొన్నిరోజులకే 126పేరు పెట్టానని, ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపాడు. కుమారుడు పుట్టకమునుపే ఈ పేరు పెట్టాలని ఆలోచించి పెట్టుకున్నానని ఆయన తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 11:45 PM