Share News

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:14 AM

ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!
Tehsildar, VRO participated in the revenue conference at Amidalagondi

సమస్యలు పరిష్కారంకాక ప్రజల అవస్థలు

మడకశిర రూరల్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు 6 నుంచి జనరవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సదస్సులో తహసీల్దార్‌, రెవెన్యూ ఇనస్పెక్టర్‌, వీఆర్వో, మండల సర్వేయర్‌, రిజిస్ట్రేషన శాఖ అధికారిలేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు. మొదటి రోజు ఛత్రం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు మాత్రం ప్రభుత్వం కేటాయించిన అన్నీ శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ కొన్ని శాఖ అధికారులు సదస్సులకు డుమ్మాకొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆమిదాలగొంది గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్‌ కరుణాకర్‌, వీఆర్వో రంగనాథ్‌ మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన శాఖల అధికారలు ఎవరూ రాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తంచేశారు. దీనిపై తహసీల్దార్‌ కరుణాకర్‌ను వివరణ కోరగా రెవెన్యూ సదస్సులపై ప్రభుత్వం సూచించిన అన్ని శాఖలకు సమాచారం ఇచ్చాం. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో సిబ్బంది కోరత ఉండడంతో వారు రాలేకపోయారు.

Updated Date - Dec 20 , 2024 | 12:15 AM