CRICKET : లీగ్ పోటీలతో గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:21 AM
ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్ పోటీలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని జిల్లా క్రికెట్ అసోసియేషన అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్తంగా శుక్రవారం స్థానిక తపోవనం క్రికెట్ గ్రౌండ్స్ లో అండర్-15 బాలుర రూరల్ క్రికెట్ లీగ్-2024 క్వాలిఫయర్ మ్యాచ నిర్వ హించారు.
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్ పోటీలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని జిల్లా క్రికెట్ అసోసియేషన అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం, ఆర్డీటీ సంయుక్తంగా శుక్రవారం స్థానిక తపోవనం క్రికెట్ గ్రౌండ్స్ లో అండర్-15 బాలుర రూరల్ క్రికెట్ లీగ్-2024 క్వాలిఫయర్ మ్యాచ నిర్వ హించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్‌రెడ్డి పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. అనంతరం నిర్వహించిన మ్యాచలో తపోవనం క్రికెట్ అకాడమీ, మడకశిర జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన తపోవనం క్రికెట్ అకాడమీ 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. తన్మయి కార్తీక్‌రెడ్డి 125పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన మడకశిర 24 ఓవర్లలో 65 పరుగులకు కుప్పకూ లింది. టీసీఏ బౌలర్ కుశాల్‌రాయల్ 5 వికెట్లు తీసి 181 పరుగుల తేడాతో జట్టు విజ యంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన ఇనచార్జి సెక్రటరీ భీమలింగారెడ్డి, మేనేజర్ సాగర్‌చౌదరి, కోచలు రవికాంత, తాహీర్, అశోక్, టీసీఏ చైర్మన శివ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....