Share News

OPS : ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:51 PM

పాత పెన్షన విధానం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ విధానాలు తమకు అమోదయోగ్యం కాదని ఏపీటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పెన్షన విద్రోహ చీకటి దినంగా అభివ ర్ణిస్తూ ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు, సానే రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

OPS : ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
APTF leaders protest in front of Dharmavaram Tehsildar's office

ధర్మవరం, సెప్టెంబరు 1: పాత పెన్షన విధానం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ విధానాలు తమకు అమోదయోగ్యం కాదని ఏపీటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పెన్షన విద్రోహ చీకటి దినంగా అభివ ర్ణిస్తూ ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు, సానే రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...పాత పెన్షన విధానం పునరుద్ధరించి, ఉద్యోగ, ఉపాధ్యాయుల 20సంవత్సరాల కోరికను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా జీఓ నంబర్‌ 117, జీఓ నంబర్‌ 84ను వెంటనే రద్దుచే యాలని డిమాండ్‌చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ధర్మవరం పట్టణ, మండల బాధ్యులు ఈశ్వరయ్య, శివానంద, చెన్నే కొత్తపల్లి మండల బాధ్యులు బాలయ్య, రామగిరి మండల బాఽధ్యులు నరసింహులు, బత్తలపల్లి మండల బాధ్యులు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


కదిరి అర్బన: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరించాలని ఎపీటీఎఫ్‌ 1938, ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. ఆర్‌అండ్‌ బంగ్లానుంచి ఆదివారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులపై బలవం తంగా సీపీఎస్‌ను ప్రవేశపెట్టారని, వెంటనే దీన్ని రద్దు చేసి పాత పెన్షన విధానం పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు హరిప్రసాద్‌రెడ్డి, సురేంద్ర, నర్సిరెడ్డి, వెంకటేష్‌బాబు, సోమశేఖర్‌, రమణారెడ్డి, చింతా శ్రీనివాసులు, రామమోహన, ఆదిబయ్యన్న తదితరులున్నారు.

ఓబుళదేవరచెరువు: ఉపాధ్యాయులకు పాత పెన్షన విధానం అమలు చేయాలని డీటీఎఫ్‌ (డెమోట్రిక్‌ టీచర్స్‌ ఫెడరేషన) జిల్లా అధ్యక్షుడు గౌస్‌లాజం డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లా డుతూ... కేంద్రం యూనిఫైడ్‌ పెన్షన స్కీమ్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయడా న్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌, జీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన విధానం కొనసాగించాలని కోరారు. ఆయనతో పాటు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింహులు, సోమశేఖర్‌నాయక్‌ తదితరులున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 01 , 2024 | 11:52 PM