MLA SUNITHA: జగన పాలనలో పంచాయతీలు నిర్వీర్యం
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:02 AM
పంచాయతీల నిధులను దారిమళ్లించిన గజ దొంగ వైఎస్ జగన అని, వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
ధర్మవరం రూరల్(కనగానపల్లి), ఆగస్టు 23: పంచాయతీల నిధులను దారిమళ్లించిన గజ దొంగ వైఎస్ జగన అని, వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలు వినతుల రూపంలో ఇవ్వాలన్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామ సభల్లో గుర్తించి తీర్మానం చేసిన సమస్యలను రానున్న రోజుల్లో విడతలవారిగా పనులు చేపడతామన్నారు. గత వైసీపీ పాలనలో పంచాయతీలకు చెందాల్సిన రూ.13 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తారన్నారు. ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటలు మంజూరైన రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని రైతు సంజీవరాయుడు పొలంలో మామిడి మొక్కలు నాటారు. అనంతరం వర్షానికి దెబ్బతిన్న టమోటాను పరిశీలించారు. రైతు రమే్‌షతో పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అలివేలమ్మ, ఈఓఆర్డీ అనిల్‌కుమార్, సర్పంచ రామాంజి, ఎంపీటీసీ శ్రీరాములు, టీడీపీ నాయకులు నెట్టెం వెంకటేష్, కన్వీనర్ యాతం పోతులయ్య, సుధాకర్‌చౌదరి, ముకుందనాయుడు, పతకమూరి ఆంజనేయులు, ఆనంద్, గోపాల్, మనోహర్‌నాయుడు, చైతు, రవి పాల్గొన్నారు.