Share News

RTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - Aug 11 , 2024 | 12:03 AM

ఏపీఎస్‌ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం అనంతపురం డిపోలో నూతనంగా వచ్చిన సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

RTC: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
MLA Daggupati is starting a new bus service

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 10: ఏపీఎస్‌ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం అనంతపురం డిపోలో నూతనంగా వచ్చిన సూపర్‌ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బస్సు ఎక్కి కొంతదూరం నడిపారు. ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో ఆర్టీసీ పట్ల మంచి నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని మరింత బలపర్చాలని సూచించారు. అనంతపురం డీఎం నాగభూపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయల్‌ మురళి, క్రిష్ణం రఘు, సుధాకర్‌ యాదవ్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ కార్మిక పరిషత నాయకులు వాసుదేవరెడ్డి, సదాశివరెడ్డి, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.


డిపోలో సమస్యలను పరిష్కరించండి: ఏపీఎస్‌ ఆర్టీసీ అనంతపురం డి పో పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్‌ మజ్దూ ర్‌ యూనియన అనంతపురం డిపో అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్‌ చేశా రు. శనివారం డిపోకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కలిసి ఎనఎంయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. సూరిబాబు మా ట్లాడుతూ... బస్టాండు ఆవరణలో ప్రయాణికులు బస్సు దిగే ప్రాంతమంతా గుంతలమయమైందని, వర్షాకాలంలో వర్షపునీరు నిలిచి మరీ ఇబ్బంది కరంగా ఉంటోందని, ఆ ప్రాంతానికి మరమ్మతులు చేయించాలని కోరారు. కాలం చెల్లిన ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సుల స్థానంలో కొత్తబస్సులు తెప్పించాలని కోరారు. డిపో కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 12:03 AM