Share News

Gooty Government hospital : క్యూలో రోగులు.. ఫోనలో సిబ్బంది..!

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:14 AM

వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్‌ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ...

 Gooty Government hospital : క్యూలో రోగులు.. ఫోనలో సిబ్బంది..!
Staff talking on cellphone carelessly

గుత్తి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం వచ్చిన రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. పదుల సంఖ్యలో బాధితులు క్యూలో నిలబడ్డారు. ఓపీ చీటీలు రాసేచోట, వైద్య పరీక్షలు నిర్వహించేచోట, చివరకు వైద్యుల వద్ద కూడా రద్దీ ఉంది. వారికి సకాలంలో సేవలు అందించాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. సెల్‌ఫోనలో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆంధ్రజ్యోతి సోమవారం విజిట్‌ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ 500 మంది దాకా రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యుల వద్ద వెళ్లేకంటే


ముందు రోగులు ఓపీ చీటీ రాయించుకోవాల్సి ఉంటుంది. ఆ చీటీ తీసుకుని బీపీ, టెంపరేచర్‌ చెక్‌ చేసే చోటుకు వెళ్లాలి. ఆ వివరాలతో డాక్టర్ల వద్దకు వెళ్లాలి. మొదటి రెండు కౌంటర్లను దాటేసరికి రోగులకు నరకం కనిపిస్తోంది. ఎంతసేపు నిలబడినా క్యూ ముందుకు కదలదు. ఆరోగ్యంగా ఉన్నవారే ఇలా గంటల తరబడి నిలబడితే నీరసించిపోతారు. ఇక రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వర్షాల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. ఆస్పత్రిలో రద్దీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో సెల్‌ఫోనలు చూస్తూ నిర్లక్ష్యం వహించడం ఏమిటని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే.. ‘న్యూసెన్స’ అని మళ్లీ ఎక్కడ పోలీసులను పిలిపిస్తారో అని సర్దుకుపోతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 26 , 2024 | 12:14 AM