MLA : కూటమి పాలనపై ప్రజల్లో హర్షం
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:52 AM
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం స్థానిక 23వ డివిజనలోని ఫెర్రర్ నగర్‌లో కార్పొరేటర్ హరిత, టీడీపీ నా యకులు, అధికారులతో కలిసి పర్యటించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్
అనంతపురం అర్బన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం స్థానిక 23వ డివిజనలోని ఫెర్రర్ నగర్‌లో కార్పొరేటర్ హరిత, టీడీపీ నా యకులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఇళ్ల స్థలాల మంజూ రు, ఇళ్ల నిర్మాణాలు, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....