Carden Search: చోళసముద్రంలో పోలీసుల తనిఖీలు
ABN , Publish Date - May 21 , 2024 | 11:55 PM
సార్వత్రిక ఎన్నికల్లో చోళసముద్రం గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు జరిగిన ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు.
లేపాక్షి, మే 21: సార్వత్రిక ఎన్నికల్లో చోళసముద్రం గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు జరిగిన ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పోలింగ్ ముగిసిన తరువాత ఎలాంటి గొడవలు జరగకుండా మంగళవారం కార్డెన సెర్చ్ నిర్వహించారు. రూరల్ సీఐ ఈరన్న ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో తనిఖీ చేశారు. దుకాణాలు, అనుమానిత ఇళ్లలో సోదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గోపీ, పోలీసులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్: నియోజకవర్గంలోఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా, ప్రేరేపించినా కఠిన చర్యలు తప్పవని సీఐ మనోహర్ హెచ్చరించారు. మండలంలోని హరేసముద్రం గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డెన సెర్చ్ నిర్వహించారు. మొదట గ్రామంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. అనుమానాలున్న వ్యక్తులపై ఆరాతీశారు. ఎటువంటి డాక్యూమెంట్‌లేని 8 బైకులను సీజ్‌చేశారు. అనంతరం గ్రామస్థులతో సమావేశాం ఏర్పాటుచేశారు. సీఐ మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.