Share News

ప్రగతి నివేదికను సిద్ధం చేయండి

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:49 PM

జిల్లాలో ఐదు నెలలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చేతన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

ప్రగతి నివేదికను సిద్ధం చేయండి
COLLECTOR CHETHAN SPEAKING

పుట్టపర్తి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదు నెలలుగా చేపట్టిన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చేతన అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో జిల్లా ఇనచార్జి మంత్రి సత్యప్రకాశ జిల్లా పర్యటనకు వస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా లో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షిస్తారని, ఇందుకు ఆయా శాఖల అధికారులు ముందస్తు నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు. పర్యటన విజయవంతం చేయడానికి సమష్టికృషి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ సీపీఓ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:49 PM