Share News

MLA DAGGUPATI : క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:19 AM

క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌ డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం 68వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన కరాటే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిం చారు.

MLA DAGGUPATI : క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రాధాన్యం
MLA Daggupati Prasad with athletes selected for national competitions

ఫఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు, క్రీడాకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌ డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం 68వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన కరాటే రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిం చారు. డీఎస్‌డీఓ ఉదయ్‌భాస్కర్‌ పోటీలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విజేతల బహుమతుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అండర్‌-17 బాలికల విభాగంలో ఇందుమతి, జయశ్రీ, అక్షిత, లీలాంజలి, తీర్థి, భాగ్యలక్ష్మి, దీపిక, వసుధ, సిందూజా, సాకియా, నందినిలు విజేతలుగా నిలిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌-14బాలికల విభాగంలో ఎస్మిత, కావ్య, సాత్విరెడ్డి, తేజశ్రీ, దివ్యసాయి, దీక్ష, లక్ష్మి, రష్మితలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్లు సరిపూటి రమణ, రాజారావు, ఎస్‌జీఎఫ్‌ రెండు జిల్లాల కార్యదర్శులు శ్రీసత్యసాయి మొరార్జీయాదవ్‌, సుగుణాభాయి, పీడీలు ఎల్‌ నాగరాజు, వేణు, కుమార్‌ రాజా, గట్టు నాగరాజు, ప్రవీణ్‌బాబు, సిరాజ్‌, దేవకి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 25 , 2024 | 12:20 AM