Share News

Liquor : ప్రైవేటు మద్యం..!

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:03 AM

ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి కూట మి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటి స్థానంలో ప్రైవే టు మద్యం దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దక్కించుకునేవారు మరుసటి రోజు.. 12న మద్యం షాపులను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 136 ప్రైవేటు మద్యం దుకాణాలకు జిల్లా...

Liquor : ప్రైవేటు మద్యం..!
Speaking Deputy Commissioner Nagamaddaiah

9వ వరకూ దరఖాస్తు గడువు

11న లాటరీ పద్ధతిన కేటాయింపు

జిల్లాలో 136 దుకాణాలకు అనుమతి

మండల జనాభా ప్రాతిపదికన పన్ను

అనంతపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి కూట మి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటి స్థానంలో ప్రైవే టు మద్యం దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దక్కించుకునేవారు మరుసటి రోజు.. 12న మద్యం షాపులను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 136 ప్రైవేటు మద్యం దుకాణాలకు జిల్లా ప్రొహిబిషన అండ్‌ ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్కో


దరఖాస్తుకు రూ. రెండు లక్షల రుసుము (తిరిగి ఇవ్వరు) చెల్లించాల్సి ఉంటుంది. తొలి రోజు మంగళవారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

జనాభా ప్రాతిపదికన పన్ను

ప్రభుత్వం మండల జనాభా యూనిట్‌ ప్రాతిపదికగా రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ వర్తింపజేసింది. పది వేల దాకా జనాభా ఉన్న ప్రాంతాల్లో రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను వర్తింపజేస్తారు. రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను ఏడాదిలో ఆరు విడతలుగా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. దుకాణాన్ని దక్కించుకోగానే ట్యాక్స్‌ మొత్తంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది.

మూడు రకాల దరఖాస్తులు

ప్రైవేటు మద్యం దుకాణాలకు మూడు రకాలుగా దరఖాస్తు చేయొచ్చు. ఆనలైన, హెబ్రీడ్‌, ఆఫ్‌లైనలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు రుసుమును ఆనలైనలోనే చెల్లించాలి. హైబ్రీడ్‌ పద్ధతిలో ఆనలైనలో వివరాలు నమోదు చేసి, దరఖాస్తు రుసుమును ఈ-చలానా రూపంలో చెల్లించాలి. ఆఫ్‌లైన పద్ధతిలో జిల్లా ప్రొహిబిషన అండ్‌ ఎక్సైజ్‌ అధికారి పేరిట డీడీ తీయాలి. దరఖాస్తుతోపాటు డీడీని స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్లల్లో సమర్పించాలి.

మండలాల వారీగా..

జిల్లాకు 136 ప్రైవేటు మద్యం దుకాణాలను కేటాయించారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో 30, అనంతపురం రూరల్‌ మండలంలో 4, ఆత్మకూరు 3, కూడేరు 3, రాప్తాడు 1, బుక్కరాయసముద్రం 4, నార్పల 4, శింగనమల 3, గార్లదిన్నె 4, గుత్తి మున్సిపాలిటీ 5, గుత్తి రూరల్‌ 2, పామిడి నగర పంచాయతీలో 8, పెద్దవడుగూరు 3, గుంతకల్లు మున్సిపాలిటీ 10, గుంతకల్లు రూరల్‌ 2, వజ్రకరూరు 2, తాడిపత్రి మున్సిపాలిటీ 9, తాడిపత్రి రూరల్‌ 3, యల్లనూరు 1, పుట్లూరు 2, పెద్దపప్పూరు 1, ఉరవకొండ 5, విడపనకల్లు 2, కణేకల్లు 4, బొమ్మనహాళ్‌ 2, రాయదుర్గం మున్సిపాలిటీ 5, రాయదుర్గం రూరల్‌ 1, డి. హిరేహాళ్‌ 1, గుమ్మఘట్ట 1, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 3, కళ్యాణదుర్గం రూరల్‌ 2, బ్రహ్మసముద్రం 1, బెళుగుప్ప 1, కంబదూరు 1, కుందుర్పి 2, శెట్టూరు మండలానికి ఒకటి చొప్పున కేటాయించారు.

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎక్సైజ్‌ డీసీ నాగమద్దయ్య తెలిపారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఎనఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మునిస్వామి, అనంతపురం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామమోహనరెడ్డి, ఏఈఎ్‌సలు శ్రీరామ్‌, రేవతితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పది ఎక్సైజ్‌ స్టేషన్లల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలసీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. మొదటి ఏడాదిలో రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ మండల జనాభా యూనిట్‌ ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రెండో ఏడాది అదనంగా 10 శాతం రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని అన్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలకు తావు లేకుండా, పాదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Oct 02 , 2024 | 12:03 AM