Share News

MINISTER SRINIVAS: పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:23 AM

కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సెర్ప్‌, ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ఎంఎ్‌సఎంఈ సెర్ఫ్‌ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

MINISTER SRINIVAS: పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం
Promotion of industrial development

సెర్ప్‌, ఎంఎ్‌సఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

పెనుకొండ టౌన, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర సెర్ప్‌, ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన ఎంఎ్‌సఎంఈ సెర్ఫ్‌ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, ఏపీఐఐసీ జెడ్‌ఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, బ్యాంకర్లు, వారి సమస్యలు సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధి కోసం మొట్టమొదటి సమీక్షా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి, నూతన పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎంఎ్‌సఎంఈ సమస్యలు మాదృష్టికి వచ్చాయని వాటన్నింటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఆటోమొబైల్‌, చేనేత పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఇవికాకుండా కొత్త తరహాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందో, ఇందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమాత్రం లభిస్తాయో అఽధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.


కక్షపూరిత రాజకీయాలు చేయం

వైసీపీ ప్రభుత్వంలో మాదిరి కక్షపూరిత రాజకీయాలు చేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆయనకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అనర్హులను తొలగించి అర్హులకు పెన్షన ఇవ్వడమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ పరిధివరకు పెన్షన సమస్యలను టీడీపీ శ్రేణులు తీసుకొస్తున్నాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి ఈ ఐదు నెలల్లోనే చేసి చూపించామన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ తొలిసారిగా ఎమ్మెల్యేలు అయినవారిలో 17మందికి మంత్రి పదవులు అప్పజెప్పారని, అందులో తామిద్దరం కూడా ఉన్నామని, బాధ్యతగా పనిచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందో స్థానిక స్థితిగతులను అధికారులతో ఆరాతీసి ముఖ్యమంత్రికి తెలియజేస్తామన్నారు.

ఒక్కొక్కటి సరిచేస్తున్నాం: మంత్రి సవిత

మంత్రి సవిత మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఒక్కొక్కటే సరి చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఇప్పటికే ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు తీసుకురావాలో ఇండస్ర్టీయల్‌ అధికారులతో సర్వే చేసినట్లు తెలిపారు. త్వరలో నూతన ఇండస్ర్టీ యాజమాన్యానికి పూర్తి సహకారం ఇచ్చి బ్యాంక్‌ యాజమాన్యంతో రుణాలు అందేలా కృషిచేస్తామన్నారు. ఇందుకుగాను సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపి కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లె సింధూర, ఎంఎస్‌ రాజు, మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరాములు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, ఉమ్మడి జిల్లాల బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు.


బ్యాంక్‌ రుణాలు ఇవ్వాలి

ఎంఎ్‌సఎంఈలకు ప్రభుత్వం షూరిటీలేని రుణాలు, క్రెడిట్‌ గ్యారెంటీలేని రుణాలు అందివ్వాలి. ఉమ్మడి జిల్లాలో ఒకశాతం ఎనపీఏ కూడా లేకపోయిన రుణాలు విరివిగా ఇవ్వడం లేదు. ఎంఎ్‌సఎంఈలపై అధికారుల దాడులు ఆపి, సమన్వయంతో మా సమస్యలు పరిష్కరించాలి. మూడు లక్షలు జనాభా ఉన్న ప్రాంతాల్లో డిమార్ట్‌ వంటి సంస్థలకు అవకాశాలు ప్రభుత్వం ఇవ్వకూడదు. వాటి టర్నోవర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. అంతేకాకుండా చిరువ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

-బైసాని రాంప్రసాద్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌,

శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు

అహుడా నుంచి తీవ్ర ఇబ్బందులు

అహుడా లైసెన్స పరిధి నుంచి తొలగించి ఎంఎ్‌సఎంఈలను ఆదుకోవాలి. గతంలో మాదిరి పంచాయతీ, మునిసిపాలిటీ అనుమతిచ్చేలా చేస్తే ఒక్కో ఎంఎ్‌సఎంఈలకు దాదాపు రూ.20లక్షలు ఆదా అవుతుంది. అలాగే విద్యుత సమస్యలు అధికంగా ఉన్నాయి. చార్జీలు తగ్గిస్తే మరింత ఊరట ఇచ్చినట్లు అవుతుంది. బ్యాంక్‌ యాజమాన్యం రుణు మంజూరులో ప్రాపర్టీ షూరిటీ అడగకుండా రుణాలు ఇవ్వాలి. మన రాష్ట్రంలో తయారు చేసిన వస్తువులు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇతర రాష్ట్రాల వస్తువులు నిషేదించాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది.

-శేషాంజనేయులు, చాంబర్‌ ఆప్‌ కామర్స్‌, అనంతపురం జిల్లా అధ్యక్షుడు

Updated Date - Dec 17 , 2024 | 12:24 AM