ROADS: రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Oct 17 , 2024 | 11:52 PM
ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌అండ్‌బీ డీఈ జగదీష్ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు.
మడకశిర, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌అండ్‌బీ డీఈ జగదీష్ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వాటిని పరిశీలించి ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. తాత్కాలిక మర్మతులకు రూ.50లక్షలు అవసరమని తెలిపారు. భక్తరపల్లి రోడ్డు, అగలి-జంబులబండ రోడ్‌లో ఫలారం వద్ద కల్వర్టు, ఇటికేపల్లి వద్ద కల్వర్టు, రోళ్ల-మధూడి రోడ్డు, రోళ్ల-వసికెర రోడ్‌లలో పలు చోట్ల దెబ్బతిన్నాయని వాటికి సంబందించి ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామన్నారు.