YCP Kethi Reddy: ప్యాలెస్‌ను ఖాళీ చేయండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్‌కు నోటీసులు..
ABN , Publish Date - Nov 08 , 2024 | 10:59 AM
అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై అధికారులు కొరడా ఝలిపించారు. వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు.
Former MLA Kethireddy Venkatarami Reddy: అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యేకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై అధికారులు కొరడా ఝలిపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్ లపై సెల్ఫీ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. ధర్మవరం చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ పాదయాత్రలో నారా లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ప్రభుత్వ భూమితో కలిసి చెరువును సైతం కబ్జా చేసినట్లు.... దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు.
ఆక్రమించిన భూములపై..
ధర్మవరం రెవెన్యూ పరిధిలోనే సర్వేనెంబర్ 904, 905, 908,908 సర్వే నంబర్లు పరిధిలోనే రైతుల నుంచి 25 ఎకరాలు గాలి వసుమతి కొనుగోలు చేసినట్లు అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లోకి ఎక్కించారు. ఈ సర్వే నంబర్లకు ఆనుకుని ఉన్న 908,909,910,616-1 సర్వే నంబర్లు పరిధిలోనే దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. కొన్నది 20 ఎకరాలు... ఆక్రమించుకున్నది 20 ఎకరాలు కలిపి 45 ఎకరాలలో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్ గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తన తమ్ముడు కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు. ధర్మవరం మండల పరిధిలోని మల్లా కాల్వ గ్రామంలో సైతం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మల్లా కాలువ గ్రామంలో ఆక్రమించిన భూములపై పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.