CPI: ఇంటి నిర్మాణాలకు రూ.5లక్షలు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:57 PM
పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతపురంరూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): పెరిగిన ధరల దృష్ట్యా పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చే యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3సెంట్లు ప్రకారం స్థలాలు ఇవ్వాలని మండలంలోని సోములదొడ్డి పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతో్‌షకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జాఫర్‌తో పాటు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున హాజరై మాట్లాడారు. జగన ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. మం డలంలోని కందుకూరు, కక్కలపల్లి కాలనీ, కృష్ణంరెడ్డిపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, అక్కంపల్లి, రుద్రంపేట గ్రామాల్లోని సచివాలయాల్లో కూడా సీపీఐ నాయకులు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీకాంత, రూరల్ మండలం కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి నరేష్, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా, రామ య్య, వరలక్ష్మి, జిల్లా సమితి సభ్యులు ఈశ్వరయ్య, శాంతి పాల్గొన్నారు.