Share News

DULEEP TROPHY: సంజు.. ఈశ్వరన శతకాలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:21 AM

స్టార్‌ బ్యాట్స్‌మన సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌తో రెచ్చిపోతే చూడాలని ఆశించిన అనంత క్రీడాభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం ఐదు పరుగులకే ‘స్కై’ పెవిలియనకు చేరింది. సంజు శ్యాంసన, అభిమన్యు ఈశ్వరన సెంచరీలతో అలరించారు.

DULEEP TROPHY: సంజు.. ఈశ్వరన శతకాలు
Team India's players are happy after Suryakumar's dismissal

ఐదు వికెట్లు కూల్చిన నవదీప్‌ సైనీ

ఆసక్తికరంగా రెండో రోజు మ్యాచలు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 20: స్టార్‌ బ్యాట్స్‌మన సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌తో రెచ్చిపోతే చూడాలని ఆశించిన అనంత క్రీడాభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం ఐదు పరుగులకే ‘స్కై’ పెవిలియనకు చేరింది. సంజు శ్యాంసన, అభిమన్యు ఈశ్వరన సెంచరీలతో అలరించారు. ఏసీజీ-ఎ, బి మైదానాలలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ మ్చాచలు రెండో రోజు కొనసాగాయి. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 224-7తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇండియా-ఎ జట్టు రెండో రోజు శక్రువారం మరో 73 పరుగులు జోడించి 297 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 122 పరుగులతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శశావతరావత రెండు పరుగులు మాత్రమే జోడించి 124 పరుగులకు ఔట్‌ అయ్యారు. మరో బ్యాట్స్‌మన ఆవేశఖాన 16 పరుగులతో ఆరంభించి అర్ధ సెంచరీ పూర్తి చేసి అవుట్‌ అ య్యారు. ప్రసిద్ధ్‌ కృష్ణ 34 పరుగులు సాధించగా, ఆఖీబ్‌ఖాన డకౌట్‌ అయ్యా రు. ఇండియా-సి బౌలర్లలో వైశాక్‌ విజయ్‌కుమార్‌ 4 వికెట్లు, అన్షుల్‌ కాంబోజ్‌ 3 వికెట్లు, గౌరవ్‌ యాదవ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇండియా-సి జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ 17 పరుగులు, సాయి సుదర్శన 17 పరుగులు చేశారు. రజిత పటిదార్‌ డకౌట్‌ కాగా, ఇషాన కిషన 5, మానవ్‌సుతార్‌ 2, అన్షుల్‌ కాంబోజ్‌ ఒక పరుగు చేశారు. బాబా ఇంద్రజిత 34 పరుగులతో రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. అభిషేక్‌ పోరెల్‌ 82 పరుగులు సాధించారు. పల్కిట్‌ నారంగ్‌ 35 పరుగులు, వైశాక్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా-ఎ బౌలర్లలో ఆఖీబ్‌ఖాన 3 వికెట్లు, శాంష్‌ ములాని 2 వికెట్లు, ఆవేష్‌ ఖాన, తనుష్‌ కొటియాన చెరో వికెట్‌ తీశారు.


స్కై ఫెయిల్యూర్‌..

ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 306-5తో రెండో ఆట ఆరంభించిన ఇండియా-డి జట్టు 349 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో రోజు 89 పరుగులతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సంజు శ్యాంసన 106 పరుగులు సాధించారు. నవదీ్‌పసైని బౌలింగ్‌లో నితీ్‌షకుమార్‌ రెడ్డికి క్యాచ ఇచ్చి వెనుతిరిగారు. శరాన్ష జైన మరో 4పరుగులు జోడించి 26 పరుగులకు ఔటయ్యారు. సౌరభకుమార్‌ 13 పరుగులు, అర్ష్‌దీప్‌ సింగ్‌ 11 పరుగులు చేయగా, ఆకా్‌షసేన గుప్తా డకౌట్‌ అయ్యారు. ఇండియా-బి బౌలర్లు నవదీ్‌పసైనీ 5 వికెట్లు, రాహుల్‌ చాహార్‌ 3 వికెట్లు, ముకే్‌షకుమార్‌ ఒక వికెట్‌ తీశారు. ఇండియా-బి మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన అభిమన్యు ఈశ్వరన 170 బంతుల్లో 13 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో మరోసారి బాధ్యాయుతంగా ఆడి 116 సాధించారు. మరో ఓపెనర్‌ జగదీషన 13 పరుగులు, సుయాష్‌ ప్రభుదేశాయ్‌ 16 పరుగులు చేశారు. జట్టులోకి చేరిన స్టార్‌ బ్యాట్స్‌మన సూర్యకుమార్‌ యాదవ్‌ (5) నిరాశ పరిచారు. ముషీర్‌ఖాన 5 పరుగులు సాధించగా, నితీ్‌షకుమార్‌ రెడ్డి డకౌట్‌ అయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి జట్టు 58 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. వాషింగ్టన సుందర్‌ (39), రాహుల్‌ చాహర్‌ (0) క్రీజులో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు, థాకరే 2, సౌరభ్‌కుమార్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. దులీ్‌పట్రోఫీ ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్పీ జగదీష్‌, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌, ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ పోటీలను తిలకించారు.

Updated Date - Sep 21 , 2024 | 12:21 AM