Share News

COLLECTOR : 24 నుంచి విత్తన పంపిణీ

ABN , Publish Date - May 18 , 2024 | 12:33 AM

అడిగిన ప్రతి రైతుకు ఈ నెల 24 నుంచి విత్తనం అందించాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజనలో సా గయ్యే పంటలు, విత్తన సేకరణ చర్యలు, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన చేయాలని సూచించారు. విత్తనం విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వేరుశనగతోపాటు ...

COLLECTOR : 24 నుంచి విత్తన పంపిణీ
Collector Vinod Kumar speaking in the review of seed and bank loans

కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

అనంతపురం టౌన, మే 17: అడిగిన ప్రతి రైతుకు ఈ నెల 24 నుంచి విత్తనం అందించాలని కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌, బ్యాంకింగ్‌ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజనలో సా గయ్యే పంటలు, విత్తన సేకరణ చర్యలు, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన చేయాలని సూచించారు. విత్తనం విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. వేరుశనగతోపాటు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.


విత్తన నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూదని అన్నారు. వ్యవసాయ, మార్కెఫెడ్‌ అధికారులు సమయ్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విత్తనం పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. విత్తనం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును ఏరోజుకారోజు బ్యాంకులలో జమచేయాలని, ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఏపీసీడ్స్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు పంట రుణాల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కొత్త రుణాలు ఇవ్వాలని, పాత రుణాల రెన్యువల్స్‌ చేసి అన్న దాతలను ఆదుకోవాలని సూచించారు. సమావేశంలో జేసీ కేతనగార్గ్‌, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 18 , 2024 | 12:33 AM