Share News

Arrest: మాజీ వలంటీర్‌ హత్యకేసులో ఆరుగురి అరెస్టు

ABN , Publish Date - May 21 , 2024 | 11:59 PM

మండలంలోని కొత్తబయ్యన్నపల్లి వద్ద 19వ తేదీన మల్లాపల్లిమాజీ వలంటీర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ హత్యకేసులో కొత్తచెరువుకు చెందిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ బాజీ జానసైదా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

Arrest: మాజీ వలంటీర్‌ హత్యకేసులో ఆరుగురి అరెస్టు
Dsp addressing Press conference

గోరంట్ల, మే 21: మండలంలోని కొత్తబయ్యన్నపల్లి వద్ద 19వ తేదీన మల్లాపల్లిమాజీ వలంటీర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ హత్యకేసులో కొత్తచెరువుకు చెందిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ బాజీ జానసైదా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కొత్తచెరువుకు చెందిన దూదేకుల సైఫుల్లా, ముష్టూరి కుమార్‌, రఘునాథ్‌యాదవ్‌, పల్లపు గణేషకుమార్‌, చింతకాయల హేమంతకుమార్‌, సాయినాథ్‌యాదవ్‌లను సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. కొత్తచెరువుకు చెందిన వీరంతా స్నేహితులుకాగా, కుమార్‌కు చెందిన కారులో గోరంట్ల సరహిద్దు కర్ణాటక రాష్ట్రం పెసలపర్తికి మద్యం సేవించేందుకు 19వతేదీన వెళ్లారు. అదే సమయంలో మాజీ వలంటీర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌, స్నేహితులు నరసింహమూర్తి, వెంకటనరే్‌షలతో కలిసి మద్యం సేవించడానికి పెసలపర్తి వెళ్లారు. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో కొత్తచెరువు వాసులు కొత్తబయ్యన్నపల్లి వద్ద ద్విచక్రవాహనాలకు కారు అడ్డంగా పెట్టి దాడికి పాల్పడ్డారు. అనిల్‌కుమార్‌ను తీవ్రంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వదిలేసి వెళ్లిన కారును స్వాఽధీనం చేసుకుని, ఆరుగురిపై హత్యకేసు నమోదుకాగా, నిందితులు వీఆర్‌ఓ ఓబులేసు వద్ద లొంగిపోగా, ఆయన వారిని గోరంట్ల పోలీస్‌ స్టేషనలో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. వారిని సీఐ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.


ఫిట్‌నెస్‌ కోసం డాక్టర్‌తో పోలీసుల వాగ్వాదం

అనిల్‌కుమార్‌ హత్యకేసులో నిందితులైన ఆరుగురికి మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ విషయంలో మెడికల్‌ ఆఫీసర్‌ పావని, పోలీసుల మధ్య మంగళవారం వివాదం చోటుచేసుకుంది. కొత్తచెరువుకు చెందిన నిందితులను హత్యకేసులో అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచే ముందు ఫిట్‌నెస్స్‌ సర్టిఫికెట్‌ అవసరం కాగా గోరంట్ల సీహెచసీకి పోలీసులు మంగళవారం వెళ్లారు. లీగల్‌ కేసులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే సౌకర్యం అసుపత్రిలో లేదని డాక్టర్‌ చెప్పడంతో పోలీసులు నిందితులను తీసుకెళ్లారు. అనంతరం సీఐ సుబ్బరాయుడు, ఏఎ్‌సఐ మద్దిలేటి ఆసుపత్రికి వెళ్లి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌పై చర్చించారు. మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇస్తానని, ఫిట్‌నెస్‌ ఇవ్వడానికి వీలు లేదని డాక్టర్‌ తెలిపారు. డీసీహెచఎ్‌స రవిపాల్‌తో డాక్టర్‌ ఫోనలో సంప్రదించి సీఐతో మాట్లాడేలా చేశారు. డీసీహెచఎ్‌స అలా ఇవ్వడానికి వీలు పడదని ఫోన్లలోనే తెల్చిచెప్పారు. పై అధికారి ఆదేశం మేరకు డాక్టర్‌ సర్టిఫై చేసినా, అలాకాదంటూ 54సీఆర్‌పీసీ అని రాస్తూ ధృవీకరించాలని పోలీసులు పట్టుపట్టారు. రిమాండ్‌ నిందితులను హాజరు పరచడానికి ఆలస్యమవుతోందని, ఇందుకు కారకులైన డాక్టర్‌పై కోర్టులో ఫిర్యాదు చేస్తామంటూ ఒత్తిడి తెచ్చారు. డాక్టర్‌ ససేమిరా అనడంతో తిరిగి వెళ్లిన పోలీసులు సాయంత్రం మళ్లీ ఆసుపత్రికి వచ్చి, డాక్టర్‌తో చర్చించారు. ఎన్నికల కౌంటింగ్‌ ముగిశాక రికార్డులతోపాటు మెడికల్‌ లీగల్‌, ఫిట్‌నెస్‌ ధ్రువీకరించేలా ఆసుపత్రికి ఆదేశాలు ఇస్తామని తెలిపారు. దీనిపై డాక్టర్‌ పోలీసులకు వివరిస్తూ, గోరంట్లలో సౌకర్యం లేకపోవడంతో పెనుకొండ ఆసుపత్రికి ఫార్వర్డ్‌ చేస్తూ ధ్రువీకరించడంతో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

Updated Date - May 21 , 2024 | 11:59 PM