Share News

MLA DAGGUPATI : త్వరలో 10వేల ఇళ్లను పూర్తి చేస్తాం

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:23 AM

అర్బన నియోజకవ ర్గంలో త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజే స్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక రెండో డివిజనలోని వినాయక నగర్‌, భాగ్యనగర్‌లో మంగళవారం ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ నాగరాజు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

MLA DAGGUPATI : త్వరలో 10వేల ఇళ్లను పూర్తి చేస్తాం
MLA who inquires about people's problems

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురం అర్బన, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అర్బన నియోజకవ ర్గంలో త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజే స్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక రెండో డివిజనలోని వినాయక నగర్‌, భాగ్యనగర్‌లో మంగళవారం ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ నాగరాజు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇళ్లు, డ్రైనేజీ, రేషన సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించినా అతీగతీలేకుండా పోయిందని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. గత ఐదేళ్లల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా మాయ మాటలతో కాలయాపన చేశారన్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణలు ఏ దశలో ఉన్నాయో.. అలాగే ఉండిపోయాయన్నారు.


కేవలం రంగులు మార్చి హంగామా చేశారన్నారు. రేషన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుర్రం నాగభూషణం, రాయల్‌ మురళీ, కుంచెపు వెంకటేష్‌, మున్వర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బేడ, బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి

బేడ, బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కు బేడ, బుడగ జంగాల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్ర మంలో ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. నాయకులు నారాయణస్వా మి, రాంబాబు, అంజి, మల్లి, చిన్న మారెన్న, దస్తగిరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 27 , 2024 | 12:24 AM