TDP MEMBERSHIP: సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:23 AM
అనంతపురం అర్బన నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
అనంతపురం అర్బన, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అనంతపురం అర్బన నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ పార్టీ అంటే వ్యక్తులు కాదని, మనం పనిచేస్తోంది పార్టీ కోసం, సీఎం చంద్రబాబు కోసమన్నారు. సభ్యత్వ నమోదులో భాగస్వాములు కాని క్లస్టర్, యూనిట్ ఇనచార్జిల వివరాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై నమ్మకంతో పైలెట్ ప్రాజెక్టుగా అనంత అర్బనలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, నిర్దేశించిన సమయంలోగా వంద శాతం సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. మాజీ మేయర్ స్వరూప, రాష్ట్ర నాయకులు బుగ్గయ్య చౌదరి, గంగారామ్, సరిపూటి రమణ, కుంచెపు వెంకటేష్, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వరన, పీఎం లక్ష్మీపస్రాద్, గుర్రం నాగభూషణం, రహ్మతబీ, లక్ష్మీనరసింహ, చేపల హరి, తమ్మినేని వేణుగోపాల్, నెట్టెం బాలకృష్ణ, కంఠాదేవి పాల్గొన్నారు.