MLA : విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:49 AM
విద్యార్థులు సెల్‌ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నా రు. కేక్‌కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు.
క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సెల్‌ఫోనలకు దూరంగా ఉండి, మంచి నడవడికతో ముందుకె ళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నా రు. కేక్‌కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంత రం పాఠశాలను పరిశీలించారు. ఇంటర్ వరకు తరగ తులు ఉండటంతో విద్యార్థులతో మాట్లాడారు. వాటర్ ప్లాంటు పాడైందని మరమ్మతు లు చేయించాలని విజ్ఞప్తి చేయగా ఒక్క రోజులోనే చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండల రెవిన్యూ అధికారితో మాట్లాడి అనువైన ఆటస్థలం ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...విద్యార్థినులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపకున్నారు. ఇటీవల కొందరు సెల్‌ఫోనలు చూసి చెడుదోవ పడుతున్నారని ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని పెట్టుకుని అందుకు ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, ఎంఈఓ శ్రీనివాసులు, కేజీబీవీ ఎస్‌ఓ సౌమ్యలత, టీడీపీ నాయకులు పేపర్‌శీన, అక్కులప్ప, ఎల్ శ్రీధర్ నాయుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు, ఎంపీటీసీ శ్రీనివాసులు, గుర్రంశీన, నాగరాజు, చంద్రమోహన, మనోహర్, విశ్వనాథ్, నరసయ్య పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....