Chandrababu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు చంద్రబాబు ‘ప్రజాగళం’
ABN , Publish Date - Mar 28 , 2024 | 09:09 AM
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababunaidu) పర్యటించనున్నారు. రాప్తాడు (Raptadu), శింగనమల (Shinganamala), కదిరి (Kadiri) నియోజకవర్గాల్లో ప్రజాగళం (Prajagalam) బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీ పీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు.
మదనపల్లి నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో గురువారం ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, 10.40 గంటలకు అనంతపురం శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాప్తాడు బస్టాండ్ సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం రాప్తాడు బస్టాండు దగ్గర నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ భోజన విరామం తీసుకుంటారు.
ఆర్డీటీ స్టేడియం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభ వద్దకు 2.20కి చేరుకుంటారు. 2.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బుక్కరాయసముద్రం నుంచి బయలు దేరి 4.30 గంటలకు నగర శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరుతారు.