MLA : నిరుపేదలకు టీడీపీ అండ
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:41 AM
నిరు పేదలకు టీడీపీ అండగా ని లుస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహా య నిధి సొమ్మును ఆమె శనివారం అందజేశారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఫ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
శింగనమల, డిసెంబరు21 (ఆంధ్రజ్యోతి) : నిరు పేదలకు టీడీపీ అండగా ని లుస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహా య నిధి సొమ్మును ఆమె శనివారం అందజేశారు. ఆమె నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శింగనమల నియోజకవర్గంలోని ఐదుగురికి రూ.4,78,646 చె క్కులను అందజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలను ఆదుకుంటూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
కనగానపల్లి : మండలంలోని తల్లిమడుగుల గ్రామానికి చెందిన ఉప్పర సూరి అనారోగ్యానికి గురె పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందాడు. ఆయనకు సీ ఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ2,55,225 చెక్కు మంజూరైంది. దానిని శనివారం సర్పం చ ఈడిగ రామాంజినేయలు టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో సాగునీటీ చైర్మన వెంకటనారాయణ, మనోహరనాయుడు, శీనా, తోగంటి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....