AMBEDKAR: అంబేడ్కర్‌కు టీడీపీ నివాళి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:12 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని శుక్రవారం టీడీపీ నాయకులు నిర్వహించారు.
అనంతపురం డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని శుక్రవారం టీడీపీ నాయకులు నిర్వహించారు. నగరంలోని జడ్పీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఎంఎస్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, మాజీ మేయర్ స్వరూప, ఇతర నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ తరతరాలకు గుర్తుండిపోయే సేవలను అందించారని కొనియాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జగనరెడ్డి రాజ్యాంగం అమలు చేసి అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, గంగారామ్, విశాలాక్షి, స్వప్న, సరిపూటి రమణ, కూచి హరి పాల్గొన్నారు.