SPORTS : థ్యాంక్యు సీఎం సార్..!
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:49 AM
క్రీడారంగానికి మహర్దశ, క్రీడాకారులకు వరాలు కురిపించే క్రీడా పాలసీ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రీడాకారులు, కోచలు, క్రీడా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీకి మద్దతుగా మంగళవారం సాయంత్రం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.
క్రీడా పాలసీ పట్ల హర్షం
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): క్రీడారంగానికి మహర్దశ, క్రీడాకారులకు వరాలు కురిపించే క్రీడా పాలసీ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రీడాకారులు, కోచలు, క్రీడా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీకి మద్దతుగా మంగళవారం సాయంత్రం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బ్యాడ్మింటన అసోసియేషన అధ్యక్షుడు బుగ్గయ్యచౌదరి, బాస్కెట్‌బాల్ అసోసియేషన కార్యదర్శి నరేంద్రచౌదరి మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7కోట్లు నజరానా ప్రకటించడం అభినందనీయ మన్నారు. ఆసియా, జాతీయ క్రీడలు, ఇతర పోటీల్లో పతకాలు సాధించిన విజేతలకు భారీగా ప్రోత్సాహకాలు అందజేయడం శుభసూచికమన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3శాతానికి పెంపు హర్షణీయమన్నారు. క్రీడాకారుల పట్ల, క్రీడారంగం పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నూతన క్రీడా పాలసీ అద్దం పడుతుందని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ షఫీ, సభ్యులు రామాంజనేయులు, రాకేష్, సీనియర్ కోచ వెంకటేశ్వర్లు, దేవమణి, కోచలు నరేష్, వంశీ, సంధ్య, లక్ష్మి, శివకుమార్, హుస్సేనఖాన, పీడీలు వెంకటేశులు, గోపాల్‌రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....