Share News

MLA DAGGUPATI: లక్ష మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:54 PM

అనంతపురం నగరంలో లక్ష మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. బుధవారం స్థానిక నీరు-ప్రగతి పార్క్‌లో గ్రీన ఆర్మీ నిర్వాహకుడు అనిల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA DAGGUPATI: లక్ష మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యం
MLA Daggupati watering plants in Niru-Pragati Park

అనంతపురం అర్బన, జూలై 31: అనంతపురం నగరంలో లక్ష మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. బుధవారం స్థానిక నీరు-ప్రగతి పార్క్‌లో గ్రీన ఆర్మీ నిర్వాహకుడు అనిల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మున్సిపల్‌ ఆర్‌డీ మూర్తితో కలిసి ఎమ్మెల్యే పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన అందక అనేక మంది చనిపోయారని, ఇలాంటి విపత్తులు చూసైనా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు రాజారావు, గంగారామ్‌, గోళ్ల సుధాకర్‌ నాయుడు, కూచి హరి, రాయల్‌ మురళీ పాల్గొన్నారు.

అనంత క్లబ్‌ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పా: అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా అనంతపురం క్లబ్‌ను అభివృద్ధి కృషి చేస్తానని తాను చెప్పానని, పేకాట నిర్వహణకు కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి ధనం సంపాదించాలనే కర్మ తనకు పట్టలేదన్నారు. క్లబ్‌లో సభ్యుల అభ్యర్థన మేరకు వ్యాయామ పరికరాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం కావాల్సిన పరికరాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పానన్నారు. కొంత మంది తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా అలాంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు.


నేడు పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే హాజరు: అనంతపురం అర్బన నియోజకవర్గంలో గురువారం నిర్వహించే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హాజరుకానున్నారు. ఉదయం 6 గంటలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగే పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొంటారు.

ప్రజాసమస్యలపై తక్షణం స్పందించాలి

అనంతపురంరూరల్‌: ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలని పంచాయతీ, సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. బుధవారం మండలంలోని రాజీవ్‌కాలనీ పంచాయతీ ప్రధాన సచివాలయంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురు స్థానికులు డ్రైనేజీ, చెత్త, తాగునీరు, డంపింగ్‌ యార్డు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. వారితో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యల పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 31 , 2024 | 11:54 PM