Share News

PROTEST : ముగిసిన భూనిర్వాసితుల వంటావార్పు

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:05 AM

గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన, బెల్‌ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం అమలు చేసి, పరిహారం అందించాలంటూ భూనిర్వా సితులు చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. వారు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రెండురోజల నిరసన క్యాక్రమాన్ని మంగళవారం చేపట్టిన విషయం విదితమే. రెండో రోజు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు వెంకటేశ, మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్‌షాద్‌ హాజరై ప్రసంగిం చారు.

PROTEST : ముగిసిన భూనిర్వాసితుల వంటావార్పు
CPM leader Venkatesa speaking at the dharna

పదిరోజుల్లో సమస్య పరిష్కరిస్తాం: డీఆర్‌ఓ

పెనుకొండ, ఆగస్టు 28: గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన, బెల్‌ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం అమలు చేసి, పరిహారం అందించాలంటూ భూనిర్వా సితులు చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. వారు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రెండురోజల నిరసన క్యాక్రమాన్ని మంగళవారం చేపట్టిన విషయం విదితమే.


రెండో రోజు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు వెంకటేశ, మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్‌షాద్‌ హాజరై ప్రసంగిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... 2013భూచట్టాలను అమ లుచేసి ఆదర్శంగా ఉండాల్సిన జిల్లాస్థాయి అధికారులు నిర్వాసితులకు పునరావాసం ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పునరావాసాల కోసం మూడేళ్లుగా అడుగుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌ కలెక్టర్‌ కార్యాల యం డీఏఓకు సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ అందజేశారు. ఈ విషయాన్ని డీఏఓ ఫోన ద్వారా డీఆర్‌ఓ భాగ్యరేఖకు తెలియజేశారు. రైతల సమస్యలను పదిరోజుల్లో పరిష్కరిస్తామని డీఆర్‌ఓ హామీ ఇచ్చారని, దీంతో భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు వాయిదా వేస్తామని సీపీ ఎం నాయకులు తెలిపారు. సమస్యలు పదిరోజుల్లో పరిష్కారం కాని పక్షంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాల యం ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొండ వెంకటేశులు, రామాంజినేయులు, రైతులు వెంకటలక్ష్మమ్మ, అచ్చమ్మ, వెంకటరామిరెడ్డి, వెంకటరాముడు, గంగమ్మ, నరసమ్మ, కదిరప్ప, మారుతి, రైతులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2024 | 12:05 AM