Share News

New sp : ప్రశాంతత పరిరక్షణే లక్ష్యం

ABN , Publish Date - Aug 20 , 2024 | 12:16 AM

జిల్లాను ప్రశాంతంగా ఉంచడమే లక్ష్యమని ఎస్పీ పి.జగదీష్‌ అన్నారు. డీపీఓలోని తన చాంబర్‌లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. బేసిక్‌ పోలీసింగ్‌పై దృష్టి పెడతామని, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తామని అన్నారు. గంజాయి, సైబర్‌ నేరాల నియంత్రణలకు గట్టి చర్యలు తీసుకుంటామని ..

New sp : ప్రశాంతత పరిరక్షణే లక్ష్యం
SP Jagdish who took charge

కొత్త ఎస్పీ జగదీష్‌.. బాధ్యతల స్వీకరణ

అనంతపురం క్రైం, ఆగస్టు 19: జిల్లాను ప్రశాంతంగా ఉంచడమే లక్ష్యమని ఎస్పీ పి.జగదీష్‌ అన్నారు. డీపీఓలోని తన చాంబర్‌లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. బేసిక్‌ పోలీసింగ్‌పై దృష్టి పెడతామని, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, నిష్పక్షపాతంగా, చట్టపరంగా వ్యవహరిస్తామని అన్నారు. గంజాయి, సైబర్‌ నేరాల నియంత్రణలకు గట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ తరువాత తన ఛాంబర్లో డీఎస్పీలతో సమావేశమయ్యారు. జిల్లాలో తాజా పరిస్థితులను సమీక్షించారు. నేర నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, ప్రజలకు


భరోసా కలిగించే బేసిక్‌ పోలీసింగ్‌ను మెరుగుపరచుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీలు టీవీవీ ప్రతాప్‌, రవికుమార్‌, జనార్దననాయుడు, శివభాస్కర్‌రెడ్డి, బీవీ శివారెడ్డి, మునిరాజ(ఏఆర్‌) పాల్గొన్నారు.

ఎందుకో ఇలా..

చిన్న చిన్న విషయాలనూ జిల్లా పోలీసు శాఖ అధికారులు మీడియాకు చెప్పడం లేదు. జిల్లాకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వచ్చినా, ఇక్కడున్నవారు రిలీవ్‌ అయినా మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తుంది. కానీ పోలీసు శాఖ ఈ వివరాలనే చెప్పడం లేదు. బదిలీ అయిన ఎస్పీ కేవీ మురళీకృష్ణ బదిలీ ఆదివారం రిలీవ్‌ అయ్యారు. ఆ విషయం గురించి మీడియాకు చెప్పలేదు. రాత్రి ఎప్పుడో ఫొటోలు పంపితేగానీ విషయం తెలియలేదు. పీఆర్వోకు సైతం సమయానికి చెప్పడంలేదని సమాచారం. కొత్త ఎస్పీ జగదీష్‌ బాధ్యతలు తీసుకుంటున్న విషయాన్ని కూడా చెప్పడానికి వెనుకాడారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 20 , 2024 | 12:16 AM