Share News

PARITALA SUNITHA: సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:27 PM

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

PARITALA SUNITHA: సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
Party workers and women met MLA Paritala Sunitha

అనంతపురం అర్బన, ఆగస్టు 5: సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు అధికారులతో ఆమె పలు అంశాలపై సమీక్షించారు. అలాగే ప్రజలు, కార్యకర్తలతో స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ... గత ఐదేళ్లలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సల గౌరవం తగ్గించేలా పాలన సాగిందని, కానీ తమ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు తొలి సమావేశంలోనే వారికి గౌరవం తెచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అధికారులంటే పాలకులకు సేవకులు కాదని, ప్రజలకు సేవకులన్న విషయాన్ని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలుపై వైసీపీ నాయకుల విమర్శలకు సీఎం క్లారిటీ ఇచ్చారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, వంద రోజుల ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకురావడం హర్షణీయమన్నారు. అధికారులు నేరుగా పేద వర్గాలను కలవడం ద్వారా వారు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా సీఎం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని వర్గాలను ఉన్నత స్థాతికి తీసుకొచ్చేలా చొరవ చూపుతుందన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:27 PM