Share News

PALLE UMA: స్ఫూర్తిదాత పల్లె ఉమా

ABN , Publish Date - Aug 31 , 2024 | 12:03 AM

సామాన్య గృహిణాగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థల అధినేతగా, రాజకీయరంగంగా, సంఘసేవకురాలుగా సేవాలందించిన స్ఫూర్తిదాత అని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు.

PALLE UMA: స్ఫూర్తిదాత పల్లె ఉమా
Family members paying their respects at Uma Ghat in the village

అనంతపురంరూరల్‌, ఆగస్టు 30: సామాన్య గృహిణాగా జీవితం ప్రారంభించిన పల్లె ఉమా బాలాజీ విద్యా సంస్థల అధినేతగా, రాజకీయరంగంగా, సంఘసేవకురాలుగా సేవాలందించిన స్ఫూర్తిదాత అని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆయన సతీమణి పల్లె ఉమా ఆరో వర్ధంతిని కక్కలపల్లి సమీపంలోని పల్లె వ్యవసాయ క్షేత్రంలో ఆమె ఘాట్‌ వద్ద నిర్వహించారు. పల్లె రుఘునాథరెడ్డితోపాటు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, శ్రీబాలాజీ విద్యాసంస్థల చైర్మన పల్లె వెంకటకృష్ణ కిశోర్‌ రెడ్డి, మనవరాలు, మనవడు వన్స, వియాన, కుటుంబ సభ్యులు మాజీ డీజీపీ శంకర్‌రెడ్డి, సతీమణి సౌభాగ్యరాణి తదితరులు ఘన నివాళి అర్పించారు. పల్లె మాట్లాడుతూ పల్లె ఉమా ఆదర్శ గృహిణిగా గొప్ప దార్శనికురాలుగా ఎంతో మంది విద్యార్థులకు విద్య అవకాశం కల్పించిందన్నారు. పల్లె ఉమా వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 40మంది రక్తదానం చేశారు. శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో రాఘవేంద్ర వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు అందించారు. పల్లె ఉమకు నివాళి అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని, సీపీఐ రాష్ట్ర నాయకులు జగదీష్‌, మాజీ మేయర్‌ స్వరూప, టీడీపీ సీనియర్‌నాయకులు గడ్డంసుబ్రమణ్యం, కేశవరెడ్డి, జేఎనటీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య సుదర్శనరావ్‌, రిజిసా్ట్రర్‌ రమే్‌షబాబు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ అధ్యక్షులు హేమచంద్రారెడ్డితోపాటు పల్లె సోదరులు రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంతరెడ్డి, ప్రిన్సిపాళ్లు రమే్‌షబాబు, సుబ్బారావు, మన్మదేశ్వరరెడ్డి ఉన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 12:03 AM