Share News

MINISTER SAVITHA: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:52 PM

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు.

MINISTER SAVITHA: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి లక్ష్యం
Minister Savita is showing that this is what development means

పెనుకొండ రూరల్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు పడ్డ రోడ్లను బాగు చేస్తున్నామని అన్నారు. ఆదివారం పెనుకొండ సమీపంలో జరుగుతున్న తారురోడ్డు పనులను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పెనుకొండలో ఫ్లైఓవర్‌ నుంచి కుంభకర్ణ ప్రాజెక్ట్‌ వరకు రూ.18కోట్ల నిధులతో తారు రోడ్డు పనులు మంజూరయ్యాయన్నారు. రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను నాణ్యమైన పనులు చేయించాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో గుంతలుపడ్డ రోడ్డును కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

భైరవేశ్వరస్వామి సన్నిధిలో మంత్రి, ఎంపీ

గోరంట్ల: మండలంలోని పాపిరెడ్డిపల్లి కాళ భైరవేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన శాంతి పూజల్లో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి విడివిడిగా పాల్గొన్నారు. అనంతరం వారు మల్లాపల్లి టీడీపీనాయకుడు స్టోర్‌ డీలర్‌ శ్రీధర్‌ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన సోమలింగారెడ్డి అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా మంత్రి ఆయన ఇంటికెళ్లి పలకరించారు. బూదిలి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చాకలి సురేష్‌ ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడి, చికిత్సఅనంతరం విశ్రాంతి తీసుకుంటుండంగా మంత్రి పరామర్శించి రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అలాగే గౌనివారిపల్లి మాజీ ఎంపీటీసీ నాగభూషణ కుటుంబ సభ్యులు మృతిచెందండంతో ఆమె వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. కన్వీనర్‌ సోముశేఖర్‌, కొత్తపల్లి నరసింహప్ప, పచ్చా అశోక్‌, సుధాకర్‌రెడ్డి, బాలక్రిష్ణ, వెంకటరెడ్డి, మహమ్మద్‌, నీలకంఠ, ఆదినారాయణ, రవి, బ్రహ్మాచారి పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:52 PM